RSS

శ్రీహరియొక్క సత్య సంకల్పం

 పూర్వం యమధర్మరాజు శ్రీ మహావిష్ణువుయొక్క దర్శనార్థమై వైకుంటమునకు బయలుదేరెను. వైకుంటముయొక్క ముఖ ద్వారమున గరుడదేవుడు కాపలాగా ఉన్నాడు. యమధర్మరాజు గరుడుడితో కొద్దిసేపు సంభాషించి శ్రీహరిని దర్శించుటకు వచ్చివున్నానని శ్రీహరికి విన్నపమును చేయమన్నాడు. గరుడుడు వైకుంటమునకు ప్రవేశించి యమధర్మరాజు వచ్చిన సమాచారమును విన్నవించాడు. భగవంతుడు దర్శనమునకు అనుమతించమని ఆదేశించాడు. గరుడుడు శ్రీహరి సన్నిదినుండి తిరిగివచ్చి యముడిని శ్రీహరి దర్శనమునకు అనుమతించెనె. గరుడుడు తిరిగివచ్చు సమయమున నరకలోకాధిపతియైన యమధర్మరాజు వైకుంట ముఖద్వారముపై కూర్చొని వున్న పక్షిని తదేకంగా, ధీర్ఘాలోచనతో చూస్తుండడం గమనించాడు. యమధర్మరాజు వైకుంటద్వారం ప్రవేశించగానే గరుడుడి మనస్సులో ఆలోచన మొదలయ్యింది. యమధర్మరాజు ఆ పక్షిని తదేకంగా ఎందుకు చూస్తున్నాడు? అని సమాధానంకోసం ఆలోచించసాగాడు. కొద్దిసేపటి తరువాత తన మనస్సులో సమాధానం తట్టింది.  “నరకలోకాధిపతికి ప్రాణములను హరించుటయే ప్రథమ కర్తవ్యము. ఈ పక్షియొక్క ప్రాణములను తీసుకుపోవుటకు కాబోలు కూర్చొని వున్న పక్షిని తదేకంగా చూస్తున్నాడు. నేను ఎలాగైనా ఈ పక్షిని రక్షించవలెను అదే నా యొక్క ప్రస్తుత కర్తవ్యము” అని అలోచించ సాగాడు. వెంటనే ఆ పక్షిని తన వెంటతీసుకొని ఏడు సముద్రముల అవతల ఒక మఱ్ఱిచెట్టూ తొర్రలో దాచి ఏమీ ఎరుగనట్టు వచ్చి ముఖద్వారము వద్ద సంతోషంగా నిల్చున్నాడు.

     శ్రీహరిని దర్శించుకొని యమధర్మరాజు ముఖద్వారము వద్దకు చేరి పక్షిని గమనించడం మొదలుపెట్టాడు. పక్షి కనిపించకపోవడంతో నిల్చొనివున్న గరుడుడిని కాసేపటిక్రితం ఇక్కడ ఒక పక్షివున్నది, ఇప్పుడు అది కన్పించడంలేదు? ఎటు వెళ్ళిందని ప్రశ్నించాడు?  దానికి గరుడుడు తనకేమీ తెలియదని, తాను అసలు పక్షిమొహమే చూడలేదని సమాధానం చెప్పాడు. సమాధానం విన్న యమధర్మరాజు కొద్దినిమిషములు తన దివ్యదృష్టితో అలోచించి, విషయం తెలుసుకొని సంతోషము పట్టలేక నవ్వుకొంటూ యమపురికి తిరుగుప్రయాణం కట్టాడు. యముడు ఎందుకు ఇలా నవ్వుతున్నాడో గరుడుడికి అర్థంకాకపోవడంతో యమధర్మరాజువద్దకు వెళ్ళి నవ్వడానికిగల కారణాన్ని వివరించమని ప్రాదేయపడ్డాడు. దానికి యమధర్మరాజు ప్రశాంతంగా సమాధానాన్ని గరుడుడి ఇలా తెలియజేసాడు గరుడా ముఖద్వారముపై కూర్చొనివున్న పక్షి ఏడుసముద్రాల అవతల ఒక మఱ్ఱిచెట్టు, ఆచెట్టు  తొఱ్ఱలో ఒక మార్జాలము (పిల్లి) వున్నదు. ఆ పిల్లికి ఆహారంగా ఈ పక్షి తన దెహాన్ని సమర్పిస్తుందని, ప్రాణాలు విడుస్తుందని శ్రీహరియొక్క సంకల్పం. నేను శ్రీహరిని దర్శించుటకు వెళ్ళునపుడు ఆపక్షికేసిచూసి ఇది ఏడు సముద్రాల అవతల చెట్టుతొఱ్ఱలోవున్న పిల్లికి ఆహారం ఎలా అవుతుందా అని దీర్ఘంగా అలోచించసాగాను. ఈ కార్యానికి శ్రీహరి  నిన్ను ప్రేరేపించినాడు. పక్షిని రక్షించాలని సంకల్పించి నీవు దానిని ఏడుసముద్రాల అవతల వున్న చెట్టు తొఱ్ఱలో దాచావు కాని శ్రీహరి సంకల్పం ప్రకారం ఇ పక్షి పిల్లికి ఆహారమయ్యింది.  అని వివరించాడు. దానికి గరుడుడు సిగ్గుతో తలదించుకొని పశ్చాత్తాపడ్డాడు.

    శ్రీహరియొక్క శక్తికి, సంకల్పానికి వ్యతిరేకంగా ఆలోచించి భంగపడ్డాను. శ్రీహరి ఒక్కడే సత్య సంకల్పమని మరచి వ్యవహరించానని శ్రీహరియొక్క దివ్యపాదములపై  శిరస్సు వుంచి క్షమించమని వేడుకున్నాడు. పరమదయాళు, సర్వగతుడు, సర్వసమర్థుడుమరియు సర్వజ్ఞుడు అయిన శ్రీహరి నీవు నిమ్మిత్తమాత్రుడవు. జీవులయొక్క స్వభావము మరియు కర్మలననుసరించి సృష్ఠి, స్థితి లయలు జరుగుతున్నయని వివరించాడు. తానొకటి తలస్తే దైవమొకటి తలంచి అన్న వాఖ్యాన్ని ప్రతి ఒక్క మనుజుడు తెలుసుకోవలెను. గరుడుడు మరియు నరకలోకాధిపతియైన యమధర్మరాజు ఊహించలేని సత్యాన్ని సామాన్య మానవమాత్రులమైన మనం ఖచ్చితంగా ఊహించగలగడం సాధ్యమా? అని ప్రతివొక్క జ్యోతిష్యుడు తమను తాము ప్రశ్నించుకొంటే ఏది మంచిది, ఏది విధి అన్న జ్ఞానం భోదపడుతుంది. ఆ జ్ఞానంతో దేనిని జ్యోతిషం ద్వారా చెప్పవచ్చు దేనిని చెప్పడం నిషిద్దం అని తెలుస్తుంది. జ్యోతిషంలో ఈ ధర్మాధర్మముల విచక్షణ జ్ఞానంలేకుండా ఫలమును చెప్పరాదు. యతోధర్మః తతోజయః

శ్రీ కృష్ణార్పణమస్తు.

Advertisements
 

Leave a Reply

Please log in using one of these methods to post your comment:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s

 
%d bloggers like this: